Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

Advertiesment
renu desai

ఠాగూర్

, మంగళవారం, 21 అక్టోబరు 2025 (14:51 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, సినీ నటి రేణూ దేశాయ్ భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తానని అంటున్నారు. తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమన్నారు. భవిష్యత్‌లో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు ఇపుడు మంచి పాత్రలు వస్తున్నాయన్నారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో అవకాశాలు వస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఒకే చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభంకానుందన్నారు. అది అత్తా కోడళ్లకు సంబంధించిన హాస్యభరిత చిత్రంగా ఉంటుందన్నారు. 
 
'టైగర్ నాగేశ్వర రావు' చేసే సమయంలోనే తనపై అనేక విమర్శలు వచ్చాయన్నారు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోందన్నారు. ఇప్పటివరకు నేను మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదన్నారు. ఏ సినిమాకు సంతకం చేయలేదన్నారు. నేను సినిమాలు అంగీకరించలేదని నా గురించి అలా మాట్లాడినవారు ఇపుడు వచ్చి క్షమాపణలు చెప్పరు. మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడతారంతే.
 
నాకు నటన అంటే అమితమైన ఇష్టం. కానీ, అదే నా లక్ష్యం కాదన్నారు. 15 యేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. నేను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపిస్తాను. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తాను. కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వను. ఒకవేళ నేను అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తూ ఉన్నట్టయితే ఇప్పటికీ చాల మంచి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చి ఉండేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్