సినిమాల్లో పెళ్లిల్లు మామూలే. నిజీవితంలో పార్టనర్ కోసం వెతుకుతున్నాననీ అయినా దొరకడంలేదని నటి తమన్నా భాటియా చెబుతోంది. ఈ విషయమై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు, మంచి ప్రశ్న వేశారు. నాకూ పెళ్లి చేసుకోవాలనుంది. కానీ పెళ్లికొడుకు దొరకడంలేదు. మీకు తెలిసిన వారు ఎవరైనా వుంటే చెప్పండని సరదాగానే జవాబిచ్చింది.
అప్పుడు అక్కడంతా నవ్వులు పువ్వులే. ఇది జరిగింది బెంగుళూరులో. ఇటీవలే తమన్నా మిస్టర్ ఛెఫ్ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వుంటుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో జెమినీ టీవీ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది.
బెంగుళూరులోని ఇన్నోవేటివ్ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన సెట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలను ఆమె షేర్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రకాలకు చెందిన మహిళలు, పురుషులు కూడా వంటల గురించి వారు చేస్తున్న విభిన్నమైన వంటకాలు తెలుసుకుని నేను చాలా తెలుసుకోవాల్సి వుందని అర్థం చేసుకున్నానని పేర్కొంది. తెలుగులో తమన్నా, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్‌లు హోస్ట్‌గా వున్నారు. త్వరలో ఈ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది.