Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యదార్థ సంఘటనల సైకో వర్మ - వీడు తేడా

Advertiesment
యదార్థ సంఘటనల సైకో వర్మ - వీడు తేడా
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:40 IST)
Psycho Verma still
సైకో వర్మ (వీడు తేడా) చిత్రం మోషన్ పోస్టర్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా సుపూర్ణ మలాకర్, ముస్కాన్ సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు.
 
ఈ సందర్భంగా నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ, ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడని, పాటలు కూడా అలరిస్తాయని చెప్పారు. చిత్రం అన్నివిధాలుగా చాలాబాగా వచ్చిందని, సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల* చేయాలన్న ఆలోచనలో ఉన్నామని  అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో చమక్ చంద్ర, కేదార్ శంకర్ తదితరులు తారాగణం. 
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి.రమణ, ఫైట్స్: వింగ్ చున్ అంజి, పి.ఆర్.వో: శ్రీరామ్, నిర్మాత: నట్టి కరుణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజమైన ప్రేమను గెలిచే ప్రయత్నమే 'పాగల్' - ట్రైలర్ రిలీజ్