సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను ఇటీవల రిలీజ్ అయిన ఐదు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ మహేష్ ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఆ అంచనాలు మరింతగా పెంచేయడం జరిగింది. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇకపోతే సరిలేరు నీకెవ్వరు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అదిరిపోయే విజువల్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ కలబోతగా రూపొందించబడిన సరిలేరు నీకెవ్వరు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే సినిమా తప్పకుండా సూపర్ హిట్ హిట్ అవుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ట్రైలర్‌లో మహేష్ బాబు పలికిన ‘స్టేట్ మినిస్టర్‌వి, లేడీస్‌తో ఏమి మాట్లాడుతున్నావ్’, ‘చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తరువాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ అంటూ ట్రైలర్ చివర్లో పలికే డైలాగ్స్ అదిరిపోయాయి. అలానే రష్మిక కామెడీ సీన్స్‌తో పాటు ముఖ్యంగా విజయశాంతి గారు ‘చుట్టూ వందమంది, మధ్యలో ఒక్కడు, ఎవరైనా వెళ్లి టచ్ చేయండి’ అంటూ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో అద్బుతమైన వ్యూస్, లైక్స్‌తో అదరగొడుతూ దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈనెల 11న వరల్డ్‌వైడ్‌గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.