Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతూ మొదటి భార్య గురించి సమంత? (video)

Advertiesment
Samantha
, శనివారం, 21 సెప్టెంబరు 2019 (18:00 IST)
సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ తెలుసుకుందామని అందరికీ విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అదే ఆసక్తిని క్యాష్ చేసుకుందామని మంచు లక్ష్మి ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ షో గురించి మంచు లక్ష్మీ కామెంట్స్ చేసింది. 
 
ఈ షో చేయడం కోసం నైట్ డ్రెస్‌లో రావాలని చెపితే కొందరు షాక్ అయ్యారని.. మరికొందరైతే ఉత్సాహం చూపించారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇలాంటి షోలు నార్త్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయన్నారు. కానీ సౌత్ ఆడియన్స్‌కి నచ్చాలనే తనను ఎన్నుకున్నారని.. ఈ షో నిర్వాహకుల నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పింది.
 
అంతేకాకుండా ఇది రియాలిటీ షో కాదని.. చక్కని ఫన్ గేమ్ లాంటిదని చెప్పింది. ఈ షోని ముందుగా తనకు తెలిసిన సెలబ్రిటీలతో మొదలుపెట్టినట్లు.. అందరినీ ఈ షోలో కలుసుకోవాలనుందని చెప్పింది. ప్రత్యేకంగా ఎవరిష్టమని అడిగితే.. చెప్పలేనని.. రానాని మాత్రం బాగా మిస్ అవుతున్నట్లు మంచు లక్ష్మీ వెల్లడించింది. వెబ్ సిరీస్‌లను అధికంగా చూస్తుంటాను. కానీ బుల్లితెరపై జరుగుతున్న రియాల్టీషోలు మాత్రం చూడనని స్పష్టం చేసింది.
 
ఇకపోతే.. ఫీట్ అప్ విత్ స్టార్స్ షోలో భాగంగా మంచు లక్ష్మి సమంతతో తన షోను ప్రారంభించింది. చైతన్యతో ప్రేమ ఆపై పెళ్ళికి సంబంధించి చాలామందికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పమని మంచులక్ష్మి సమంతను అడిగింది. దీనికి కొద్దిసేపు సమంత మౌనం వహించడంతో చైతన్యతో పెళ్ళికి ముందు మీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న విషయం తనకు తెలుసునని జోక్ చేసింది. 
 
దీనితో నవ్వుతూ సమంత చైతూకి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసింది. చైతూకు మొదటి భార్య వుందని షాకిచ్చింది. తనకంటే తన పడకపై వున్న పిల్లోస్ అంటేనే చైతూకు చాలా ఇష్టమని చెప్పింది. ఆఖరికి తాను చైతన్యను ముద్దు పెట్టుకోవాలనుకున్నా.. ఇద్దరి మధ్య అడ్డుగా పిల్లోస్ వుంటాయని జోక్ చేసింది.
 
అంతేకాదు బయటకు ఎంతో కూల్‌గా కనిపించే చైతన్యకు పిల్లలంటే చాలా ఇష్టమని, పెట్స్ అంటే కూడా బాగా ఇష్టపడతాడని చెప్పింది. చైతన్యతో తనకున్న ప్రేమకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఈ షోలో సమంత మంచు లక్ష్మితో షేర్ చేసింది. మొత్తానికి మంచు లక్ష్మి షోకు మంచి క్రేజ్ రాబోతోందని.. దీంతో ఇతర షోలకు ఇది పోటీ కావడం ఖాయమని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ మూడో సీజన్.. టాస్క్‌లు రిపీట్.. శ్రీముఖి తమ్ముడికి జోకర్.. ఒకటే ఏడుపు (వీడియో)