Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ వివాహం చేసుకున్న కొత్త దంపతులకు వింత శిక్ష? వీడియో వైరల్

ప్రేమ వివాహం చేసుకున్న కొత్త దంపతులకు వింత శిక్ష? వీడియో వైరల్
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (15:50 IST)
ప్రేమించి వివాహం చేసుకున్న కొత్త దంపతులకు ఆ ఊరు ఇచ్చిన విచిత్ర శిక్ష ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటపై ఆ ఊరి పెద్దలు, ప్రజలు దాడి చేశారు. తర్వాత విచిత్ర శిక్షను అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ దహోత్ జిల్లాకు చెందిన మోలీ అనే గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట.. పారిపోయి వివాహం చేసుకుంది. 
 
అయితే వీరిద్దరినీ ఆ జంటను పట్టుకున్న గ్రామ పెద్దలు, ప్రజలు, కుటుంబీకులు, బంధువులు వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆపై వారిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నందుకు శిక్షగా... ఆ యువకుడి భుజంపై కూర్చోబెట్టి ఊరిని చుట్టిరావాలన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వాసానికి మరోపైరు ఎల్.ఐ.సి... భవిష్యత్ అభద్రత : ప్రియాంకా గాంధీ