Sohail, Rishi, Priyanka Kumar, KS Nandish, Ashwin Vijay Lohit, Mathura Sridhar
25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది పాయింట్ తో రుద్ర గరుడ పురాణం ఉంటుంది. రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నడ చిత్రం మిది. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, హీరో సోహైల్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ.. కన్నడ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ చాలా బాగుంది. కొత్త కంటెంట్‌ను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కేజీయఫ్, కాంతారా దగ్గర నుంచి రీసెంట్‌గా వచ్చిన లవ్ టుడే, మహారాజా, 777 ఛార్లీ, మంజుమ్మల్ బాయ్స్ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులుగా మేం హిట్ చేశాం. ఈ మూవీ టీజర్ చూశాక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నందీశ్వర్ గారు చాలా బాగా తీశారు. రిషి గారి హైట్, పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా. నాలుగు భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు.
నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ రిషి నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూశా. ఆయన టెర్రిఫిక్ ఆర్టిస్ట్. తనతో పాటు టీమ్ అందరికీ ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు.
చిత్ర హీరో రిషి మాట్లాడుతూ, దర్శకుడు మహి వి రాఘవ గారు సైతాన్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు నన్ను పరిచయం చేశారు. గరుడ పురాణం ఎలిమెంట్స్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. రుద్ర అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. చాలా ప్యాషనేట్‌గా నందీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ మరోసారి అందిస్తారని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నాఅని చెప్పారు.
హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ...ఈ చిత్రంలో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది అని చెప్పారు.
దర్శకుడు నందీష్ మాట్లాడుతూ.. మా హీరో రిషి ఇప్పటికే ఓ తెలుగు సినిమా చేశారు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేయాలనుకున్నాం. దర్శకుడిగా నాకు, నిర్మాతగా లోహిత్ గారికి ఇది మా ఫస్ట్ మూవీ. టీజర్ అందరికీ నచ్చిందనుకుంటున్నా అని అన్నారు.
నిర్మాత విజయ్ లోహిత్ మాట్లాడుతూ.. మ బ్యానర్ అశ్విని ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కిస్తున్నాం. నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అని అన్నారు.
నటుడు జ్వాల కోటి, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.