Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిహారిక 'సూర్యకాంతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన "రౌడీ"

నిహారిక 'సూర్యకాంతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన
, శుక్రవారం, 22 మార్చి 2019 (17:54 IST)
మెగా ప్రిన్సెస్ నిహారిక టాలీవుడ్‌లో సక్సెస్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. 'ఒక మనసు' సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడినప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేదు. ఇక అప్పటి నుండి సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా విడుదలవుతున్న "సూర్యకాంతం" సినిమాలో కామెడీ ట్రై చేసింది. స్వతహాగా అల్లరి అమ్మాయిగా పేరున్న నిహారిక ఇప్పటికే జబర్దస్త్‌లో ఒకసారి ముఖ్య అతిథిగా వచ్చిన కామెడీ స్కిట్ చేసింది. మరి ఈ సినిమాలో నవ్విస్తుందో లేదో చూడాలి. ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాహుల్ విజయ్‌కు జంటగా నిహారిక నటిస్తోంది.
 
ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా యూనిట్ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎలాగైనా హిట్ టాక్ వచ్చేలా చేయడం కోసం కష్టపడుతున్నారు. 
 
ఇందులో భాగంగా మార్చి 23వ తేదీన జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో 'సూర్యకాంతం' సినిమాతో అయినా నిహారికకు విజయం వరిస్తుందో లేదో తెలియాలంటే వేచి ఉండాలి మరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రి పాలైన విజయ్ దేవరకొండ.. రష్మిక లిప్‌లాక్ ముద్దులే కారణమా?