ప్రేమ పెళ్లికాదు.. చాలా హ్యాపీగా ఉన్నా : రేణూ దేశాయ్
తన రెండో పెళ్లిపై నటి రేణూ దేశాయ్ స్పందించింది. తాను ఇపుడు చేసుకోబోయేది ప్రేమ వివాహం కాదని తెల్చిచెప్పింది. అలాగనీ, తాను ఎంపిక చేసుకున్నది కాదనీ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి కుదిర్చిన పెళ్లి అ
తన రెండో పెళ్లిపై నటి రేణూ దేశాయ్ స్పందించింది. తాను ఇపుడు చేసుకోబోయేది ప్రేమ వివాహం కాదని తెల్చిచెప్పింది. అలాగనీ, తాను ఎంపిక చేసుకున్నది కాదనీ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి కుదిర్చిన పెళ్లి అంటూ వివరించారు. అయితే, తనకు కాబోయే భర్త గురించిన వివరాలు మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా బాగా గుర్తింపు పొందిన రేణూ దేశాయ్.. త్వరలోనే మరో వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తాజాగా రేణు నిశ్చితార్థం జరిగింది కూడా. నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు తనకు కాబోయే భర్త ఫోటోలను మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా తన రెండో వివాహం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రేణు మాట్లాడారు.
"ఇది పూర్తిగా సన్నిహితులు కుదిర్చిన పెళ్లి. చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అంత ఆతృత మాత్రం లేదు. ప్రేమ అనేది జీవితంలో ఒకసారే కలుగుతుంది. మళ్లీ మళ్లీ ప్రేమలో పడడం జరగదు. గత ఏడేళ్లుగా నేను ఒంటరిగానే ఉన్నాను. అప్పుడూ సంతోషంగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నా నేను అంతే సౌకర్యంగా ఉండగలననే నమ్మకం కలిగింది. ఆయన చాలా ప్రశాంతమైన వ్యక్తి. మళ్లీ సహజీవనం చేయాలని నేను అనుకోలేదు. అందుకే సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాన"ని రేణు చెప్పారు.