Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలకు లైంగిక వేధింపులు సినీ ఇండస్ట్రీకే పరిమితం కాదు : జగ్గూభాయ్

అమ్మాయిలకు లైంగిక వేధింపులు కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదని, ఏ రంగంలోనైనా ఇవి జరుగుతూనే ఉంటాయని, అయితే, సినిమా ఫీల్డ్‌లో గ్లామర్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతోందని టాలీవుడ్ సీనియర్ నటు

Advertiesment
అమ్మాయిలకు లైంగిక వేధింపులు సినీ ఇండస్ట్రీకే పరిమితం కాదు : జగ్గూభాయ్
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (13:59 IST)
అమ్మాయిలకు లైంగిక వేధింపులు కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదని, ఏ రంగంలోనైనా ఇవి జరుగుతూనే ఉంటాయని, అయితే, సినిమా ఫీల్డ్‌లో గ్లామర్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతోందని టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు అభిప్రాయపడ్డారు. 
 
ఆయన తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. తనవరకూ సినీ రంగం సురక్షితమైనదన్న అభిప్రాయమే ఉందని, తన కుమార్తెలు యాక్టింగ్ చేస్తానని చెబితే, అభ్యంతరపెట్టబోనని స్పష్టంచేశారు. తన చిన్న కూతురు చదవలేక చదువుతుంటే, శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా? అని సలహా కూడా ఇచ్చానని అన్నారు. 
 
అయితే, తన బిడ్డలకు ఈ రంగంపై ఆసక్తి లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. తనకు పారితోషికం గురించిన ఆలోచనే రాదని, కొన్నిసార్లు డబ్బులు అడక్కుండానే సినిమాలు చేస్తానని చెప్పిన జగపతిబాబు, ఇటీవల ఓ చిన్న సినిమా కథనచ్చి, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా నటించేందుకు అంగీకరించానని తెలిపారు. 
 
గతంలో డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేశానని, ఇప్పుడు విలువ తెలుసుకుని ఖర్చు పెడుతున్నానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడటం తన మంచికే జరిగిందని అనుకుంటున్నానని, ఆ స్థితిని స్వయంగా అనుభవించడం వల్లే తిరిగి నిలబడగలిగానని అన్నారు. 'బాహుబలి' చిత్రంలో తాను పోషించదగ్గ పాత్ర లేదని రాజమౌళి భావించి ఉండవచ్చని, అందుకే తాను ఆ చిత్రంలో భాగం కాలేకపోయానని అన్నారు. 
 
తాను ఒకప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నానని, అందుకు కేవలం తన అలవాట్లు మాత్రమే కారణం కాదని, తన నుంచి డబ్బు తీసుకున్నవాళ్లు ఎంతో మంది మోసం చేశారని చెప్పారు. ఈ విషయంలో తప్పు తనదేనని, తాను మోసపోయానని, సినిమా కారణంగా దెబ్బతిన్నానని చెప్పిన ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుని, తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నానని చెప్పారు. తాను క్యాసినోలకు వెళ్లి జూదం ఆడటం వల్లే డబ్బును కోల్పోయినట్టు పలువురు భావిస్తున్నారని, అది అవాస్తవమని జగపతిబాబు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి #RRR వర్సెస్ త్రివిక్రమ్ #TTT : టాలీవుడ్ దర్శకుల మధ్య పోటీ