''సైరా''కు సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని తీసుకున్నారా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సైరా నరసింహారెడ్డి''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సైరా నరసింహారెడ్డి''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యారని తెలిసింది.
ఇకపోతే.. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రానికి ''డబుల్ ఆస్కార్ అవార్డ్స్'' గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సైరా ప్రాజెక్ట్ నుంచి బయటకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇళయరాజా, కీరవాణి వంటి పేర్లు వెలుగులోకి వచ్చాయి కానీ.. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడిని ఎంపిక చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.