Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

'సైరా'గా మారిన దర్శకుడు కుమారుడు

తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప

Advertiesment
'సైరా'గా మారిన దర్శకుడు కుమారుడు
, శనివారం, 27 జనవరి 2018 (14:15 IST)
తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవితో పాటు.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం పొలాచ్చి, రాజస్థాన్‌లతో పాటు పలు ప్రాంతాలలోనూ షూటింగ్ జరుపుకోనుంది. 
 
చిరంజీవి సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని, ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్‌కి సిద్ధమైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా చిన్న పిల్లలతో పాటు పండు ముసలి వరకు ఈ సినిమా విశేషాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తికనపరుస్తున్నారు. 
 
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడు చిరు కాస్ట్యూమ్‌కి ఫిదా అయిపోయాడట. దీంతో తనకు కూడా అలాంటి డ్రెస్ కావాలని అడిగాడట. దాంతో సురేందర్ రెడ్డి తనయుడి కోసం అలాంటి డ్రెస్సే స్పెషల్‍గా చేయించినట్టు తెలుస్తుంది. సైరా కాస్ట్యూమ్స్‌లో ఉన్న చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, డ్రెస్‌లో చాలా ముద్దుగా ఉన్నాడనే కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ "2.O" టీజర్‌పై దర్శకుడు శంకర్ క్లారిటీ