తెలుగు రాష్ట్రాలలోకాదు దేశంలో పేరున్న వ్యక్తి రామోజీరావు. ఫిలింసిటీను ఏర్పాటు చేసి దేశంలోని అన్ని భాషల చిత్రాలకు షూటింగ్ ప్లేస్‌గా చేసిన ఆయన ఇప్పుడు తాజాగా యాక్టింగ్ స్కూల్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేస్తున్నారు. ఈటీవీలో ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతున్నాయనీ, సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. పర బాషా నటీనటులు, సాంకేతిక సిబ్బందికూడా వెలుగులోకి వస్తున్నారు. అయితే ఎక్కువగా టీవీలో పరబాషా నటీనటులు కనిపించడంతో ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఔత్సాహికులను ప్రవేశం కొరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే ప్రస్తుతం వున్న ఫిలింస్కూల్‌కు ఛాలెంజ్‌గా మారినట్లే.
ఈ స్కూల్ విషయమై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఇటీవల తాను రామోజీ గ్రూపు సంస్తల అధినేత రామోజీ రావు గారిని కకలిశాను. సుమారు అరగంట సమయం నాతో గడిపారు. కొత్తవాళ్లకు నటన , సాంకేతిక రంగంలో శిక్షణ ఇవ్వడానికి రామోజీ రావు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున కూడా కొంతందని విద్యార్థులను శిక్షణ కోసం పంపాలని రామోజీగారు చెప్పారని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. అందరూ రామోజిగారిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనుంది.