Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏజెంట్ నరసింహ -117 ట్రైలర్ రిలీజ్

Agent Narasimha-117 poster
, గురువారం, 26 మే 2022 (18:07 IST)
Agent Narasimha-117 poster
కీర్తి కృష్ణ, నిఖిత, మధుబాల, హీరో హీరోయిన్లుగా షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవగిల్, నరసింహ కీలక పాత్రల్లో నటించిన చిత్రం  ''ఏజెంట్ నరసింహ-117. ఈ' చిత్రం ట్రైలర్ రిలీజ్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అతిధులుగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాస్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ హాజరై ట్రైలర్ ను విడుదల చేశారు. 
 
ఈ సందర్బంగా కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ నిర్మాత బి. నరసింహ రెడ్డి  ఎంతోకాలం నుంచి పరిచయం. రిధం స్టూడియో లోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఏజెంట్ నరసింహ -117 విడుదలకు ఫిలిం ఛాంబర్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. 
 
webdunia
Rk goud, kolli ramakrishna and others
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ చిన్న సినిమాల విడుదలకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటుందని అన్నారు. ఇటీవల తాను రామోజీ గ్రూపు సంస్తల అధినేత రామోజీ రావు గారిని కలవడం జరిగిందని అంతపెద్ద మనిషి సుమారు అరగంట సమయం ఇచ్చి మాట్లాడారని తెలిపారు. కొత్తవాళ్లకు నటన , సాంకేతిక రంగంలో శిక్షణ ఇవ్వడానికి రామోజీ రావు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున కూడా కొంతందని విద్యార్థులను శిక్షణ కోసం పంపాలని రామోజీగారు చెప్పారని ప్రతాని రామకృష్ణ గౌడ్  తెలిపారు. రామోజిగారిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. 
 
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ ఏజెంట్ నరసింహ -117 సినిమా కు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ చాప్రాల తనకు చెన్నై నుంచే మంచి మిత్రుడని  అన్నారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ గా లక్ష్మణ్ పని చేశారని చెప్పారు. పక్క మాస్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ కావాలని , దర్శకుడు లక్ష్మణ్ కు మంచి పేరు తీసుకురావాలని, నిర్మాత నర్సింహా రెడ్డికి డబ్బులు తెచ్చి పెట్టాలని అన్నారు.
 
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్  ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ చిన్న సినిమా ఏజెంట్ నర్సింహా-117 సినిమా విడుదల కోసం తాను ఎలాంటి సహాయం చెయ్యడానికి ముందు వరుసలో ఉంటానని అన్నారు. ఈ రోజుల్లో సినిమా నిర్మాణం అంత ఈజీ కాదని చెప్పారు. ఎంతో కష్టపడితేగాని సినిమా నిర్మాణం  పూర్తకాదని అన్నారు.
 
నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నిర్మాత నరసింహ రెడ్డి సినిమా జీవితం రామకృష్ణ స్టూడియో లో ప్రారంభమైందని అన్నారు.  స్వర్గీయ ఎన్  టి ఆర్ గారి అనేక సినిమాలకు నరసింహ రెడ్డి పని చేశారని చెప్పారు. ఎన్  టి ఆర్ గారి వందవ జయంతి  ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం గర్వకారణమని చెప్పారు.
 
ఏజెంట్ నరసింహ -117 నిర్మాత బి. నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అన్నారు. మాస్ సినిమాగా నిర్మించిన ఈ సినిమాలో  ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో ఈ సినిమాను రిలీజ్ చెయయడానికి ప్లాన్ చేస్తున్నామని  ఆయన అన్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన అతిదులందిరికి నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. 
దర్శకుడు లక్ష్మణ్ చప్రాల మాట్లాడుతూ ఎంతో కస్టపడి తీసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు వచ్చిన అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కెమెరామెన్ జయరాం కొరోనాతో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. 75 ఏళ్ల వయసులోనే సినిమాటోగ్రాఫర్ జయరాం ఎంతో కష్టపని పని చేశారని గుర్తు చేశారు.  జయరాం కు రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సినిమా పెద్ద హిట్ చెయ్యాలని ప్రేక్షకులను కోరారు. 
నటుడు దయ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను విలన్ పాత్రను పోషించని అన్నారు. చాలా మంచి పాత్ర అవుతుందని అన్నారు. తెలుగు , కన్నడ, తమిళ్ సినిమాల్లో నటిస్తున్నాని తెలిపారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీసింహ కోడూరి క‌థానాయ‌కుడిగా ప్రారంభమైన ఉస్తాద్