నేను గాలికి గీలికి రోడ్లపై తిరుగుతాను... వాణి కాళ్లు కందిపోతాయ్... వర్మ
గిల్లితే కాటేస్తా... అనేది పాముకు సంబంధించిన విషయం. జస్ట్ దానికి గడ్డిపోచ తగిలినా కాటేసేస్తుందట. అలాగే ఇప్పుడు రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైన తెదేపాకు సపోర్టు చేసేవారు ఎవరైనా మాట్లాడితే ఎంతమాత్రం వదలిపెట్టడంలేదు. సెటైర్లతో ఫేస్ బుక్
గిల్లితే కాటేస్తా... అనేది పాముకు సంబంధించిన విషయం. జస్ట్ దానికి గడ్డిపోచ తగిలినా కాటేసేస్తుందట. అలాగే ఇప్పుడు రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైన తెదేపాకు సపోర్టు చేసేవారు ఎవరైనా మాట్లాడితే ఎంతమాత్రం వదలిపెట్టడంలేదు. సెటైర్లతో ఫేస్ బుక్, ట్విట్టర్లలో వ్యాఖ్యలతో మోత మోగిస్తున్నాడు. తాజాగా వాణీ విశ్వనాథ్ ఎన్టీఆర్ మీద చిత్రం తీస్తే వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని వార్నింగ్ ఇచ్చింది.
వర్మకే వార్నింగ్ ఇస్తే వూరుకుంటాడా ఏమిటి... వేసేశాడు సెటైర్లు. తన ఇంటి ముందు దీక్షకు దిగేందుకు తనకు ఇల్లంటూ ఏదీ లేదని చెప్పుకున్నాడు. తను గాలికీ గీలికీ రోడ్లపై తిరుగుంటాననీ, తనను వెతికేందుకు వాణీ విశ్వనాథ్ కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగితే ఆమె పాదాలు కందిపోతాయంటూ సెటైర్లు వేశాడు. మరి ఇప్పుడే అమర్ నాథ్ రెడ్డి కూడా వర్మపై మాట్లాడారు. మరి ఆయనపై ఎలాంటి సెటైర్లు పేలుతాయో చూడాలి.