Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలు... వర్మ సెటైర్లు...

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో రాంగోపాల్ వర్మ ఓ రేంజిలో స్పందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడం లేదు. మాటకు మాటతో సమాధానాలు, సెటైర్లు వేస్తున్నారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి ఝలక్ ఇచ్చిన వర్మ తాజాగా ఎమ్మెల్యే అనితకు సమాధానాలిచ్చారు. యథాతథంగ

Advertiesment
లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలు... వర్మ సెటైర్లు...
, గురువారం, 12 అక్టోబరు 2017 (22:07 IST)
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో రాంగోపాల్ వర్మ ఓ రేంజిలో స్పందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడం లేదు. మాటకు మాటతో సమాధానాలు, సెటైర్లు వేస్తున్నారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి ఝలక్ ఇచ్చిన వర్మ తాజాగా ఎమ్మెల్యే అనితకు సమాధానాలిచ్చారు. యథాతథంగా అవి చూడండి...
 
టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:
టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు
వర్మ జవాబు: అనిత గారు, బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం
 
టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.
జవాబు: అనితగారు, ఈ సినిమా బయోపిక్ కాదు.. కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితంలో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ
 
టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.
జవాబు: అనితగారు, ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందు నుంచి విని విని విసుగెత్తిపోయాను
 
టీడీపీ ఎమ్మెల్యే అనిత: రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే.. వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..
జవాబు: లోగుట్టు పెరుమాళ్ళకెరుక
 
టీడీపీ ఎమ్మెల్యే అనిత: చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు.. జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..
జవాబు: అనితగారు, మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు
 
టీడీపీ ఎమ్మెల్యే అనిత: మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమాజహితం
జవాబు: ఆహా.. క్లాప్సు.. విజిల్స్ !!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా జరిగి సర్వం కోల్పోయాను- మిల్కీ బ్యూటీ తమన్నా