Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరణ్ రిస్క్ చేస్తున్నాడు, ఈసారి వర్కవుట్ అవుతుందా?

Advertiesment
చరణ్ రిస్క్ చేస్తున్నాడు, ఈసారి వర్కవుట్ అవుతుందా?
, సోమవారం, 9 మార్చి 2020 (22:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రజెంట్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2021 జనవరి 8న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసాడు కానీ... చరణ్ మాత్రం నెక్ట్స్ మూవీ ఏంటి అనేది ఎనౌన్స్ చేయలేదు. దీంతో చరణ్‌ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఇతనే అంటూ కొంతమంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి. 
 
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో చరణ్ నెక్ట్స్ మూవీ చేయనున్నటు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వంశీ పైడిపల్లి, సుజిత్, జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేర్లు వినిపించాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మళ్లీ రావా, జెర్సీ చిత్రాలతో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి చరణ్ కోసం కథ రెడీ చేయడం.. చరణ్‌కి చెప్పడం జరిగిందని తెలిసింది. ఇంతకీ చరణ్‌కి గౌతమ్ చెప్పిన స్టోరీ ఏంటంటే.. లవ్ స్టోరీ అని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. 
 
చరణ్‌ ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. మగధీర సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌తో ఆరెంజ్ అనే లవ్ స్టోరీ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో రిలీజైన ఆరెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీనికి కారణం మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్‌ ఇమేజ్ అమాంతం పెరిగింది. మగధీర సినిమాలో చరణ్‌‌ని ఒక వీరుడుగా చూసిన జనాలికి ప్రేమకథా చిత్రంలో చరణ్‌‌ని లవర్ బాయ్‌గా చూడడం అనేది నచ్చలేదు. అందుకనే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి చరణ్‌ లవ్ స్టోరీ జోలికి వెళ్లలేదు. 
 
మాస్‌లో తనకున్న ఇమేజ్ కి తగ్గట్టుగానే.. కమర్షియల్ మూవీస్ చేసాడు చేస్తున్నాడు. అయితే... మంచి ప్రేమకథా చిత్రం చేయలేదు అనే వెలితి చరణ్‌కి ఎప్పటి నుంచో ఉంది. అందుకనే గౌతమ్ తిన్ననూరి లవ్ స్టోరీ చెప్పగానే రిస్క్ అయినా ఫరవాలేదు అని వెంటనే ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ కథ విషయానికి వస్తే... నార్త్ అమ్మాయికి, సౌత్ అబ్బాయికి మధ్య జరిగే కథ అని.. పాన్ ఇండియా లెవెల్లో ఉండటంతో విన్న వెంటనే చరణ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. 
 
ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి ఆ సినిమా పూర్తయిన తర్వాత చరణ్‌‌తో మూవీ స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరో వైపు చరణ్‌ ప్రదీప్ అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ కూడా ఓకే చేసాడని తెలిసింది. గౌతమ్ తిన్ననూరితో లవ్ స్టోరీ మూవీ ముందుగా స్టార్ట్ చేస్తాడా..? లేక కొత్త దర్శకుడు ప్రదీప్‌తో ముందుగా సినిమా చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా?