Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి మరో లీక్... (Video)

Advertiesment
'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి మరో లీక్... (Video)
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:24 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్ ప్రోగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఒక్కకంటే ఒక్క సమాచారాన్ని కూడా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, లీకుల రూపంలో ఇపుడు రెండో లీక్ బయటకు వచ్చింది. 
 
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌తో పాటు మరికొందరు స్టార్లు నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో రాం చరణ్ అల్లూరి రామరాజుగా నటిస్తుండగా, ఆయన సరసన సీతగా ఆలియా భట్ నటిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్, సీతా మహాలక్ష్మిగా ఆలియా భట్ ఇలాగే కనిపించనున్నారంటూ, ఓ రెండు చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
ఎన్నడో తీసిన పాతకాలం నాటి చిత్రాలుగా ఇవి కనిపిస్తున్నాయి. వీటిని సినిమా కథానుసారం, ఫైల్ ఫొటోలుగా వినియోగించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోలో రాం చరణ్, బ్రిటీష్ సైనిక అధికారిగా కనిపిస్తున్నాడు. ఇక అల్లూరి సీతారామరాజు తన జీవితంలో బ్రిటీష్ అధికారిగా పని చేయలేదు. ఇక ఈ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటి? అది ఎలా వచ్చిందో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగక తప్పదు.
 
కాగా, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా 'ఆర్ఆర్ఆర్' గురించి బయటకు వచ్చే ఏ సమాచారం అయినా, అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తుంది కాబట్టి, ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ లీకులపై చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, ఈ చిత్రం జూలై నెలాఖరులో విడుదల కావాల్సివుండగా, వచ్చే యేడాది సంక్రాంతికి వాయిదావేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ కోసం వచ్చి గబుక్కున బుగ్గపై ముద్దుపెట్టి తుర్రున పారిపోయిన అభిమాని (video)