Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరణ్‌, బన్నీ గురించి చరణ్‌ సిస్టర్ సుస్మిత సంచలన వ్యాఖ్యలు

Advertiesment
చరణ్‌, బన్నీ గురించి చరణ్‌ సిస్టర్ సుస్మిత సంచలన వ్యాఖ్యలు
, శనివారం, 21 మార్చి 2020 (22:51 IST)
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ఎలా చేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి ఇంతలా సక్సస్ అవ్వడానికి ప్రధాన కారణం డ్యాన్స్ అని కూడా చెప్పచ్చు. సినిమా ఏదైనా.. పాటల్లో డ్యాన్స్ అదరగొట్టేస్తారు చిరంజీవి. ఆయన డ్యాన్స్ కోసమే సినిమాలు చూసేవాళ్లు ఉన్నారంటే.. అతిశయోక్తికాదు. నేటికీ చిరంజీవి అలాగే డ్యాన్స్ చేస్తుండటం విశేషం. చిరు 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రంలో కూడా డ్యాన్స్ అదరగొట్టేసారు. 
 
ఇదిలా ఉంటే... మెగా హీరోల్లో రామ్ చరణ్‌, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ బాగా చేస్తుంటారు. అయితే... చరణ్‌, బన్నీ ఈ ఇద్దరిలో ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారు అని చిరంజీవి కుమార్తె, చరణ్‌ సిస్టర్‌ని అడిగితే... వేరే ఆలోచన లేకుండా బన్నీ డ్యాన్స్ బాగా చేస్తాడని చెప్పింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుస్మిత ఈవిధంగా స్పందించడం విశేషం.
 
ఇదిలా ఉంటే.. చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. ఇందులో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవి నటన,  శ్రీదేవి అందం, అభినయం, ఇళయరాజా సంగీతం, దర్శకేంద్రుడి దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణం... ఇలా అన్నీ పర్ఫెక్ట్‌గా కుదరడంతో విభిన్న కథాంశంతో రూపొందిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సంచలన విజయం సాధించింది. 
 
అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ తీయనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. చిరు తనయుడు రామ్ చరణ్ - శ్రీదేవి కుమార్తె జాన్వీ జంటగా జగదేకవీరుడు - అతిలోకసుందరి సీక్వెల్ తీయాలని నిర్మాత అశ్వనీదత్ ప్రయత్నించారు కానీ.. ఇప్పటివరకు క్లారిటీ లేదు.
 
 అయితే.. చరణ్‌ ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అని చిరు కుమార్తె సుస్మితను అడిగితే... మరో ఆలోచన లేకుండా జగదేకవీరుడు అతిలోకసుందరి అని చెప్పింది. 
 
అంతేకాకుండా ఈ సినిమాలో చరణ్‌ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ నటిస్తే బాగుంటుందని కూడా చెప్పింది. మరి.. సుస్మిత కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి రీమేక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటుంది కాబట్టి భవిష్యత్‌లో ఈ సినిమా తప్పకుండా వస్తుందని ఆశించవచ్చన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ వైపు కరోనా - మరోవైపు షూటింగ్స్ బ్రేక్ - మన స్టార్స్ ఏం చేస్తున్నారు?