Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేక పుట్టిస్తున్న సుంద‌రి... ఎవ‌రా భామ‌..?

Advertiesment
కేక పుట్టిస్తున్న సుంద‌రి... ఎవ‌రా భామ‌..?
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:41 IST)
టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల 'మ‌న్మ‌థుడు 2' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలావుంటే... పంజాబీ పాల్కోవా రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. తన బాడీ ఫిట్నెస్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. 
 
అయితే రొటీన్‌కు భిన్నంగా ఈసారి రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. బీచ్‌లో బ్లూ బికినీతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన రకుల్ 'పైన ఆకాశం, క్రింద ఇసుక.. లోపల ఆనందం. చుట్టూ అంతా సంతోషమే' అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. 
 
ప్రస్తుతం రకుల్ హాట్ బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా నాగార్జునతో రకుల్ నటించిన 'మన్మథుడు 2' ప్లాప్ అయ్యింది. తదుపరి ప్రాజెక్ట్స్ వెళ్లడానికి ముందు రకుల్ చిల్ అవుతుంది. రకుల్ ఫొటోలు చూసిన నెటిజన్స్ అందరూ ఫొటోలు చాలా హాట్‌గా ఉన్నాయని అంటున్నారు. అందాల‌ను ఆర‌బోయ‌డానికి ఏమాత్రం వెన‌కాడ‌ని ఈ అమ్మ‌డు ఈ మ‌ధ్య కాలంలో స‌క్స‌స్‌కి బాగా దూర‌మైంది. మ‌రి... ఆమె కోరుకుంటున్న‌ స‌క్స‌స్ ఎప్పుడు వ‌స్తుందో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సాహో' అద్భుత చిత్రం... చూసేందుకు ఎదురు చూస్తున్నా : నారా లోకేశ్