Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Advertiesment
rajamouli

ఠాగూర్

, గురువారం, 17 ఏప్రియల్ 2025 (16:06 IST)
హీరో ఎన్టీఆర్‌పై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అంటూ కొనియాడారు. "ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్" అనే డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదలకానుంది. ఈ డాక్యుమెంటరీ ప్రచారంలో భాగంగా జపాన్‌కు వెళ్లిన రాజమౌళి... అక్కడ మీడియాతో మాట్లాడుతూ, తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
 
'కొమురం భీముడో' వంటి కష్టమైన పాటను చిత్రీకరించడం ఎన్టీఆర్ వల్లే తనకు సులభమైందన్నారు. ఆ పాటలో తారక్ నటన మరో స్థాయిలో ఉంటుందని చెప్పారు. శరీరంలోని అణువణువులో తారక్ హావభావలను పలికించాడని కితాబిచ్చారు. తారక్ అద్భుతమైన నటుడని ప్రశంసించారు. ఆ పాట వెనుక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉందని చెప్పారు. 
 
తారక్ విషయానికి వస్తే బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న "వార్-2" సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. ఆగస్టు 14వ తేదీన విడుదలకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్