Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

Advertiesment
Mahesh babu airport

దేవీ

, మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (09:56 IST)
Mahesh babu airport
ఇటీవలే మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎస్.ఎస్.ఎం.బి.29 షూటింగ్ అమెజాన్ అడవి ప్రాంతంలో షూట్ చేశారు. కొంత గేప్ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి జపాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ బిహైండ్ అండ్ బియాండ్ మేకింగ్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్. సినిమా గురించి డాక్యుమెంటరీ చేసి జపాన్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఇక మహేష్ బాబు కూడా వెకేషన్ నిమిత్తం కొంతకాలం గడిపారు. నేడు తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు.  ఈ సందర్బంగా పలువురు ఆయనను ఫొటో తీయడానికి ప్రయత్నించారు. ఆయన సున్నితంగా నవ్వుతూ నడుచుకుంటూ బయటకు వచ్చారు.
 
ఎస్.ఎస్.ఎం.బి.29 కథను విజయేంద్రప్రసాద్ రాశారు. జంగిల్ ఎడ్వంచర్ కథగా రూపొందించారు. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఆస్కార్ అవార్డులలో ఈ సినిమా యాక్షన్ కేటగిరిలో అవార్డుల కోసం ఎంట్రీ కి పంపనున్నట్లు సమాచారం. 2028లో 100 ఏళ్ళ ఆస్కార్ వేడుక జరగనుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. 
 
ఇక హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఎడ్వంచరీ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలను, వి.ఎఫ్.ఎక్స్ సిబ్బందినిఇప్పటికే రాజమౌళి కలిసినట్లు వెల్లడించారు. తెలుగు సినిమాలో ఆర్.ఆర్.ఆర్. కు మించిన సినిమా ఇది కాబోతుందని రాజౌళి టీమ్ చెబుతోంది. ప్రియాంకచోప్రా, ప్రుథ్వీరాజ్ కుమార్ ఇప్పటికి ఎంపికైన తారాగణం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా