చిత్రపరిశ్రమలో ఎంతో మందితో కలిసి పనిచేసినప్పటికీ కొందరితో మాత్రమే ప్రత్యేక అనుబంధం ఉంటుందని ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా అంటున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశానని, ఎన్నో నిర్మాణ సంస్థలతో కలిసి పని చేశానినీ, కానీ, ప్రత్యేక అనుబంధం మాత్రం సంపత్ నందితో ఏర్పడిందన్నారు.
తమన్నా నటించిన చిత్రం "ఓదెల-2". ఈ నెల 17వ తేదీన విడుదలవుతుంది. ఈ మూవీని సంపత్ నంది, డి.మధులు కలిసి నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 17వ తేదీన విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంతో మందితో పనిచేసినా కొందరితోనే ఎవరికైనా ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని అన్నారు. అలా సంపత్ నందితో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయనతో తనకు ఇప్పటికీ నాలుగు చిత్రాలు చేశానని, ఆయనకు తాను జీవితాంతం రుణపడివుంటానన్నారు. ఈ చిత్రం తమ కోసం కాకపోయినా సంపత్ నంది, మధు కోసం ఖచ్చితంగా విజయం సాధించాలన తమన్నా ఆకాంక్షించారు. వారిద్దరికి ఇది పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.