ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం రాధే శ్యామ్. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జులై 30 విడుదలచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదేరోజు గంగూబాయి కతియవాడి`కూడా విడుదల తేదీని ప్రకటించారు. ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. చారిత్రాత్మక నేపథ్యంలో ప్రేమకావ్యంగా రూపొందున్న ఈ సినిమాకు హిందీలో బాహుబలి తర్వాత ప్రభాస్ కు మంచి ఆదరణ వుంది. అయితే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన "మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై" అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్‌గడ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆడది ఎవరికి భయపడాల్సిన పనిలేదు. రాజకీయనాయకులకు, మంత్రులకు, పోలీసులకు అంటూ పదునైన సంభాషణలు ఇందులో ఆలియా చెబుతోంది. ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ఆర్.ఆర్.ఆర్. కూడా విడుల కావాల్సివుంది. గంగూబాయ్ సినిమాతోనే ఆర్.ఆర్.ఆర్. సినిమా క్రేజ్ ముడిపడివుంది. కరోనా కారణంగా బాలీవుడ్ అంతా గందరగోళంగా వుండడంతో ఇంకా మూడు నెలలు వుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని రెండు సినిమాలు సిద్ధమవుతున్నాయి. రెండూ బాలీవుడ్‌లోనూ రిలీజ్ కావాల్సివుంది. అందుకే ప్రభాస్ రాధేశ్యామ్ గురించి మరిన్ని అప్‌డేట్స్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.