Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనెందుకు క్షమాపణ చెప్పాలి... నాకేం అసూయ లేదు..

Advertiesment
నేనెందుకు క్షమాపణ చెప్పాలి... నాకేం అసూయ లేదు..
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:25 IST)
ఇటీవల కోలీవుడ్‌లో తమిళ సీనియర్ నటుడు రాధారవి లేడీ సూపర్ స్టార్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన రేగిన దుమారం ఇంకా సాగుతూనే ఉంది. ఆ సమయంలో రాధారవిపై పలువురు సినీ ప్రముఖులు నిప్పులు చెరిగారు. అయినా కూడా రాధారవి దూకుడు తగ్గలేదు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదనే అంటున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ దుమారంపై మళ్లీ ఆయన స్పందించారు. 
 
మీరు నయనతారకు క్షమాపణలు చెప్పారా అని అడగ్గా, నా వ్యాఖ్యల్లో తప్పేముందో నయనతార చెప్పాలి. ఆ వ్యాఖ్యల వలన బాధపడ్డానని నయనతార చెప్తే అప్పుడు క్షమించమని కోరుతానని పేర్కొన్నాడు. అయినా ఎవరో కొందరు తప్ప మిగిలినవారంతా సమర్ధించారంటే నావైపు నిజం ఉన్నట్లే కదా అని తెలిపారు. 
 
మీరు ఆమెపై అసూయతోనే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎలా స్పందిస్తారని అడగ్గా... అలా అయితే నా తర్వాత ఎంతోమంది నటీనటులు నా స్టార్స్‌గా ఎదిగారు. మరి నేనెందుకు వాళ్లని అనలేదని ఎదురు ప్రశ్నించారు. 
 
సినిమా రంగంలో నటీనటుల మధ్య పోటీని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఎవరి ప్రత్యకత వాళ్లకు ఉంటుంది. ఎవరి పారితోషికం వాళ్లకు వస్తుంది. ఇందులో అసూయ పడాల్సినవసరం లేదని తెలిపారు. పారితోషికం తక్కువైనంత మాత్రాన నా నటన విలువ తగ్గిపోదని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీలియోన్ కన్నీటిపర్యంతం.. వీడియో నెట్టింట వైరల్