Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీలియోన్ కన్నీటిపర్యంతం.. వీడియో నెట్టింట వైరల్

Advertiesment
Sunny Leone
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:13 IST)
కో-ఆర్టిస్ట్, అసిస్టెంట్‌ను కాపాడుకోలేకపోయామని పోర్న్‌కమ్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సన్నీలియోన్ పంజాబ్‌లో పుట్టి అమెరికాలో నటిగా మారింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఐటమ్ గర్ల్‌గా అదరగొడుతోంది. అయితే ఆమె పోర్న్ స్టార్ అనే ముద్రను చెరుపుకోలేకపోతుంది. 
 
ఆమెపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ పడుతూనే వున్నాయి. ఈ కామెంట్స్‌పై సన్నీలియోన్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇటీవల నటుడు అర్భాజ్ ఖాన్ నిర్వహించే ఓ టీవీ కార్యక్రమంలో సన్నీలియోన్ పాల్గొంది. గత ఏడాది సన్నీ తన అసిస్టెంట్‌కు సాయం అర్థించి ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టుకు వ్యతిరేకతలు వచ్చాయి. దీనిపై సన్నీ తాజాగా స్పందించింది. 
 
తన సహ నటుడు, అసిస్టెంట్ అయిన ప్రభాకర్‌‌కు రెండు కిడ్నీలు పని చేయలేదు. అవి 20 శాతమే పనిచేస్తాయనే విషయం లేటుగానే తెలిసింది. ఆయన వైద్య ఖర్చులు తనతో పాటు తన భర్త కూడా చేశాం. మనతో పనిచేసే వ్యక్తికి అలాంటి పరిస్థితి ఏర్పడటం షాక్‌నిచ్చింది. ప్రభాకర్‌ను నమ్ముకుని వున్న కుటుంబాన్ని ఆదుకోవాలనే సాయం అర్థించి పోస్టు పెట్టాను. 
 
అయితే ఇందుకు వ్యతిరేకత వచ్చింది. తనకు వందల డాలర్ల ఆస్తులున్నాయి. కాదనలేదు. కానీ ఇతరుల కష్టాలను చూసి తపించి పోయే వారు ప్రభాకర్‌కు సాయం చేస్తారనే ఉద్దేశంతోనే.. ఆ పోస్టు పెట్టానని క్లారిటీ ఇచ్చింది సన్నీలియోన్. 
 
అంతేకాదు ప్రభాకర్‌ను బతికించుకోవాలని.. శాయశక్తులా ప్రయత్నించినా ఆయన్ని కోల్పోయామని సన్నీ కన్నీటిపర్యంతం అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసినవారంతా సన్నీకి మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ9 రిపోర్టర్‌గా నటుడు నిఖిల్ కొత్త అవ‌తారం..!