Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వనాథ్ గారు చెప్పినా వినలేదు.. సినిమాల్లోకి అమ్మాయిలు రావొద్దు.. జయలలిత

Advertiesment
prema entha madhuram
, బుధవారం, 20 జనవరి 2021 (19:15 IST)
Jayalalithaa
బ్రాహ్మణ అమ్మాయివి.. పైగా డిగ్రీ చదివావు.. మంచి డాన్సర్‌వి.. డాన్స్ ప్రోగ్రామ్‌లు ఇవ్వు.. లేదంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో.. అంతే తప్ప సినిమాల్లోకి వద్దని దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ ఆమెను సినిమాల్లోకి వద్దని చెప్పినా వినలేదు అంటూ.. సీనియర్ నటి జయలలిత చెప్పుకొచ్చారు. 
 
జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో ఆర్యకి తల్లిగా శారదాదేవి పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు సీనియర్ నటి జయలలిత. 30 ఏళ్ల ఆమె సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది జయలలిత. టాలీవుడ్‌లో వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జయలలిత. ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కమల్ హాసన్‌ సరసన వ్యాంప్ పాత్రలో కనిపించిన జయలలిత.. వరుసగా అలాంటి పాత్రల్నే చేస్తూ వచ్చింది. సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో కష్టాలు అనుభవించిన జయలలిత ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు.
 
అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. క్రాస్ బెల్ట్ మనీ వాళ్లకి వీళ్లకి ఒకే డేట్ ఇచ్చారు నాన్న.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నేను వాళ్ల షూటింగ్‌కి వెళ్లలేదు. క్రాస్ బెల్ట్ మనీ అంటే మీనా వాళ్ల మావయ్య.. ఆయన కూడా ఈ టైప్ సినిమాలు చేసేవాడు. నేను వినోద్ సినిమా చేస్తుండగా.. వాళ్లు షూటింగ్ లొకేషన్‌లోకి వచ్చి గొడవ చేశారు. ఆ టైంలో వినోద్ నన్ను సేవ్ చేశాడు. నేను మాట్లాడతా అని.. నన్ను రూంలో పెట్టి లాక్ చేశాడు. ఆ ఘటనతో వినోద్‌కి బాగా కనెక్ట్ అయిపోయా. నాకు హీరోలా కనిపించాడు.
 
అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నాం.. ఏడేళ్ల ప్రేమ తరువాత నాకు డౌట్ కొడుతూనే ఉంది.. ఇది ఎంత వరకూ కరెక్ట్ అని. కానీ వినోద్ నన్ను బాగా కంగారు పెట్టాడు.. పెళ్లి చేసుకుందాం అని. అలా మలయాళ దర్శకుడు వినోద్‌ని పెళ్లి చేసుకున్నా. ఆర్నెళ్లకే అతని నిజస్వరూపం బయటపడింది. అతనితో సంబంధాలు తెంచుకున్నారు.
 
ప్రస్తుతం జయలలిత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. తన మేనమామ కొడుకు భాస్కర్ తోడుగా ఉండటంతో అతనితో కలిపి ఉంటున్నారు జయలలిత. ఆమె డేట్స్, అకౌంట్స్.. ఇంట్లో వండి పెట్టడం అన్నీ జయలలిత బావ భాస్కర్ చూసుకుంటున్నాడు. అతనికి కూడా 45 ఏళ్లే పైబడినా పెళ్లి చేసుకోకుండా జయలలిత కోసమే ఉండిపోవడం విశేషం.
 
ఈ నేపథ్యంలో సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు దయచేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు సీనియర్ నటి జయలలిత. ‘బాగా చదువుకుని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోండి.. సినిమాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం రావొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తా.. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చూశా కాబట్టి చెప్తున్నా.. మగవాళ్లకి అయితే పెద్ద ఇబ్బంది లేదు.. ఆడపిల్లలైతే ఈ ఫీల్డ్ ఎందుకోవద్దు’ అని చెప్తోంది జయలలిత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీనాక్షి చౌదరితో ఖిలాడిలో మాస్ మహారాజ లిప్ లాక్?