Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ హను-మాన్ టీజర్ రాబోతుంది

Advertiesment
Teja Sajja
, సోమవారం, 7 నవంబరు 2022 (16:55 IST)
Teja Sajja
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్తో వస్తున్నారు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.
 
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 15న హను-మాన్ టీజర్ విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రంగుల చొక్కా, పంచె ధరించి ఒక కొండపై నిలబడి శంఖం పూరిస్తున్నట్లు కనిపించారు తేజ సజ్జ. పొడవాటి జుట్టు, గడ్డం, కంప్లీట్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ లో తేజ సజ్జా లుక్ అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్ హీరోగా కనిపించనున్నారు. పోస్టర్ మార్వలెస్ గా కనిపిస్తోంది.
 
వరలక్ష్మి శరత్కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
 
తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
 
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్ప్లే: స్క్రిప్ట్స్విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్
ఎడిటర్: ఎస్బీ రాజు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెఫ్ గా అనుష్క శెట్టి బర్త్ డే లుక్