క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది, ఈ రేంజ్ చిత్రానికి ఇది హ్యూజ్ ఫీట్. పెద్ద సినిమాలకు కూడా 100 రోజులు పెద్ద విజయం. హను-మాన్ మంచి సెంటర్లలో ఈ మైలురాయిని చేరుకుంది.
92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. సినిమా 1 కోటి ఫుట్‌ఫాల్స్ దాటింది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన 'హను-మాన్' జీ5లో కూడా ప్రసారం అవుతోంది.