Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవికృష్ణ వడిలో కూర్చున్న చైత్ర, బుడగ పగిలింది: శ్రీముఖిపై ట్రోల్స్

Advertiesment
bubble burst

ఐవీఆర్

, సోమవారం, 22 ఏప్రియల్ 2024 (15:40 IST)
గేమ్ షోలు ఈమధ్య కాలంలో విపరీతంగా వెగటు పుట్టిస్తున్నాయంటూ చాలామంది చెప్పుకుంటున్న మాట. తాజాగా యాంకర్ శ్రీముఖి హోస్టుగా చేస్తున్న ఓ షోలో కూడా ఇదే జరిగింది. బుల్లితెర స్టార్ కపుల్ నటుడు రవికృష్ణ, చైత్ర రాయ్ జంటగా చేసిన ఓ టాస్క్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
 
ఇంతకీ ఆ షో ఏంటయా అంటే... రవికృష్ణ కుర్చీలో కూర్చుంటాడు. చైత్ర బుడగలను తీసుకుని వచ్చి అతడి వడిలో వేసి ఆ బుడగపై కూర్చుని గట్టిగా నొక్కుతూ పగలగొట్టాలి. పగిలేవరకూ అతడి ఒడిలో వున్న బుడగులను గట్టిగా నులుముతూ వుండాలి. ఈ టాస్క్ చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.
 
రేటింగ్ కోసం ఇలాంటి జుగుప్సాకరమైన షోలను చూపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫన్ షో వల్ల వచ్చేది ఆనందం కాదు వెగటు అంటూ మండిపడుతున్నారు. అసలు పిల్లలు ఇలాంటి టాస్క్ చూస్తే ఏమవుతారో అంటూ విమర్శిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బేబీ జాన్‌తో బిజీ బిజీ-రాయల్టీ లుక్‌లో కీర్తి సురేష్