Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లేబాయ్. బాధ్యతాయుత అమ్మాయి కథే మనమే చిత్రం

Advertiesment
Sharwanand, Kriti Shetty,

డీవీ

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:31 IST)
Sharwanand, Kriti Shetty,
పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని అతిథి కథతో మనమే చిత్రం రూపొందుతోంది. శర్వానంద్ హీరో పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నారు కానీ కనిపిస్తున్నంత ఇన్నోసెంట్ కాదు. అతను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్. కృతి శెట్టి బాధ్యతాయుత అమ్మాయిగా కనిపించింది.  పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వారి జీవితాలు తలకిందులౌతాయి. పిల్లాడి రాక వారిని గందరగోళానికి గురిచేస్తుంది.
 
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య న్యూ ఏజ్ కథతో వచ్చి హ్యూమరస్ గా ప్రజెంట్ చేశారు. మూడు పాత్రల మధ్య రిలేషన్ ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్ గా కట్ చేశాడు. త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు.
 
మూడు పాత్రలు అందంగా వ్రాయబడ్డాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక పిల్లవాడి యొక్క సాధారణ మనస్తత్వాలను అద్భుతంగా చూపించారు. శర్వానంద్ ఉబెర్ కూల్‌గా కనిపించాడు. తన పాత్రలో ఆదరగొట్టారు. కృతి శెట్టి అందంగా ఉంది. తన పాత్రలో ఒదిగిపోయింది. కిడ్ విక్రమ్ ఆదిత్య అందరినీ ఆకట్టుకున్నాడు.
 
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అద్భుతంగా నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్,  గ్లింప్స్,  ఫస్ట్  సింగిల్, ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం టీజర్‌తో ముందుకు వచ్చారు, ఇది 'మనమే' మెస్మరైజ్ చేసే ప్రపంచంలోకి ఒక స్నీక్ పీక్.
 
విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలుస్తుంది, విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ తన అద్భుతమైన స్కోర్‌తో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ టాప్-క్లాస్‌గా ఉంది, అన్నింటిలో రిచ్‌నెస్ ఉంది. టీజర్ మనలోని ఆసక్తిని మరింత పెంచింది.
 
వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగ, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.
 
ఈ హాలిడే సీజన్‌లో 'మనమే' థియేటర్లలోకి రానుంది కాబట్టి ఈ వేసవి చాలా కూల్ గా ఉండబోతుంది. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ అన్ని వర్గాలను సమానంగా ఆకర్షిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం విడుదలకు సిద్ధం