Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామీణ కథతో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం

Advertiesment
Tarun Bhaskar, Esha Rebba

డీవీ

, శనివారం, 20 ఏప్రియల్ 2024 (07:19 IST)
Tarun Bhaskar, Esha Rebba
నటుడు, దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.
 
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది.  శుక్రవారం ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్‌ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. యూనిట్  విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా సంప్రదాయ చీరను ధరించింది.
 
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 ఈ చిత్రానికి దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్ రైటర్.
 తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా