Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

Advertiesment
Narasimha Nandi with movie team

దేవీ

, మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (17:18 IST)
Narasimha Nandi with movie team
నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీలో నాగిరెడ్డి ఎడిటింగ్ చేస్తూ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రల పోషించారు. మల్లిక్, నరేష్ గౌడ్ ఈ చిత్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాటలు పోషించడం విశేషం. కాగా నేడు మీడియా సమక్షంలో ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.
 
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ... నేను ఒక కథను రెండు భాగాలుగా అనుకుని మొదటిగా ఈ సినిమా మొదలుపెట్టాను. ఈ సినిమాలో ప్రతి పాత్ర మనకు పురాణాల నుండి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు అలాగే మనిషి యొక్క ఇతర ఆలోచనలు అన్నిటిని ఈ సినిమాలోని పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటూ ట్యాగ్ పెట్టడం జరిగింది. అలాగే చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు కూడా ఎంతో శ్రద్ధతో నటించారు. ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. అటువంటి వారితో కలిసి పనిచేసినందుకుగాను ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత దైవ నరేష్ గౌడ మాట్లాడుతూ... ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఎంతో అద్భుతంగా ఉండిపోతుంది. ఇటువంటి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరొక 3 సినిమాలు రాబోతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా నిలిచిపోతుంది అన్నారు.
 
నిర్మాత పరిగి స్రవంతి మల్లిక్ మాట్లాడుతూ... ఈ సినిమాలో ప్రతి పాత్ర హీరోనే. ఒక గ్రామంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకొని శ్రీ శక్తి చూపిస్తూ చేసిన సినిమా. ఎంతో ధైర్యం ఉంటే కానీ ఇటువంటి సినిమా తీయలేరు. అంతటి ధైర్యం ఉన్న వ్యక్తి మా దర్శకుడు. ఈ సినిమా అందరికీ గోస్బంప్స్ తప్పించేలా ఉంటుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mohanlal: మైథాల‌జీ ఎలిమెంట్స్‌తో యోధునిగా మోహ‌న్‌లాల్ మూవీ వృష‌భ