Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Advertiesment
Narasimha Nandi, Prudhvi, prasanna,   Daiva Naresh Gowda, and others

దేవీ

, మంగళవారం, 15 జులై 2025 (12:43 IST)
Narasimha Nandi, Prudhvi, prasanna, Daiva Naresh Gowda, and others
జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన  1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర, నటుడు పృద్వి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
 
సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగింది. 
 
దర్శకులు నరసింహ నంది మాట్లాడుతూ, నిర్మాతలు నరేష్ గౌడ, పరిగి మల్లిక్ ఈ సినిమాను చాలా ప్యాషన్ తో చేశారు, కమర్సియల్ అంశాలతో కూడుకున్న కథ ఇది, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ కథకు కనెక్ట్ అవుతారని తెలిపారు.
 
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,  ఈ చిత్ర యూనిట్ చాలా క్రమశిక్షణతో కనిపిస్తున్నారు, టాలెంట్ తో పాటు క్రమశిక్షణ చాలా అవసరం, ఈ సినిమా వీరందరికి మంచి పేరును తెచ్చి పెడుతుంది అనడంలో సందేహం లేదు, ఆర్టిస్ట్ గా కాకుండా గెస్ట్ గా వచ్చిన పృద్వి ఈ సినిమా చాలా బాగుందని చెపుతున్నారు, తప్పకుండా ఆయన మాటలు నిజం కాబోతున్నాయని తెలిపారు.
 
నటుడు పృద్వి మాట్లాడుతూ, నరసింహ నంది దర్శకత్వంలో నటించాలని ఎప్పటినుండో అనుకున్నాను, ఇప్పటికి నాకు ఇతని డైరెక్షన్ లో మంచి పాత్రలో నటించాను, ఎంతో మంది మంచి ఆర్టిస్ట్ లను పరిచయం చేసిన నరసింహ  నంది ఈ సినిమాలో మరింతమంది కొత్త నటీనటులను పరిచయం చేసారు, ఈ సినిమాలో మా అమ్మాయి శ్రీలు చక్కటి రోల్ లో ఈ సినిమాలో నటించింది తనతో పాటు అందరికి ఈ సినిమా ఒక మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
నిర్మాత నరేష్ గౌడ మాట్లాడుతూ, ఈ సినిమా నిర్మిచడం సంతోషంగా ఉంది, నరసింహ నంది గారు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు రేపు అందరూ అదే ఫీల్ అవుతారు, త్వరలో మా ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా థియేటర్స్ లో అందరిని అలరించబోతోందని తెలిపారు.
 
నిర్మాత పరిగి మల్లిక్ మాట్లాడుతూ,  ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా మా మూడేళ్ళ జర్నీ, ఎంతో కష్టపడి నాతో కలిసి నరేష్ గౌడ ఈ సినిమాను నిర్మించారు, నరసింహ నంది గారు ప్రాణం పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది, అందరూ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారని తెలిపారు.
 
హీరో విక్రమ్, సదన్, వినయ్, హీరోయిన్ అధితి మైకేల్, శ్రీలు, మోహన సిద్ది మాట్లాడుతూ, సినిమాను డైరెక్టర్ నరసింహ నంది అద్భుతంగా తెరకెక్కించారు, ఈ సినిమా లో నటించినందుకు గర్వాంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆడియన్స్ ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?