Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒగ్గు కథ నేపథ్యంలో సాగే బ్రహ్మాండ ఫస్ట్‌లుక్‌ను రవీందర్‌రెడ్డి ఆవిష్కరించారు

Brahmāṇḍa phasṭ luk, miryāla ravīndar reḍḍi, āmani, jayarām,  komaraṁ bannī rāj, kanika vādya, jōgini śyāmala, vijaya raṅgarāju Brahmanda First Look, Miryala Ravinder Reddy

డీవీ

, శుక్రవారం, 10 జనవరి 2025 (16:21 IST)
Brahmāṇḍa phasṭ luk, miryāla ravīndar reḍḍi, āmani, jayarām, komaraṁ bannī rāj, kanika vādya, jōgini śyāmala, vijaya raṅgarāju Brahmanda First Look, Miryala Ravinder Reddy
ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బ్రహ్మాండ'. ఒగ్గు కథ నేపథ్యంలో రూపొందుతోంది. చిత్ర ఫస్ట్ లుక్ ను అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది ..అని టీజర్ డిజైన్స్ చూశాను చాలా బాగా ఉన్నాయి, అందరికి అల్ ది బెస్ట్ చెప్పారు.
 
నిర్మాత దాసరి సురేష్, దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ, సినిమా టైటిల్ని ఆవిష్కరించిన రవీందర్ రెడ్డి గారికి  థాంక్స్ చెప్తూ  ఇది మొదటి విజయం గా భావిస్తున్నానని చెప్పారు. మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది.  ఒగ్గు కథ  తెలంగాణ జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. యాక్షన్స్ అన్ని మరియు  డివోషనల్ థ్రిల్లింగ్  ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి అన్నారు.
 
సినిమా హీరో బన్నీ రాజు మాట్లాడుతూ,  ప్రేక్షక దేవుళ్ళు  ఈ సినిమాక్ ని హిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను అన్నారు.
 నటీనటులు :   ఆమని, జయరామ్,  కొమరం బన్నీ రాజ్ , కనిక వాద్య , జోగిని శ్యామల, విజయ రంగరాజు , ఆనంద్ భారతి,  దిల్ రమేష్ , అమిత్ , ఛత్రపతి శేఖర్,  ప్రసన్నకుమార్ ,అనంత్  కిషోర్ దాస్, , ఐడ్ల మధుసూదన్ రెడ్డి,  మీసం సురేష్, దేవి శ్రీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ఏజెంట్ గై 001 ట్రైలర్