Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీఎన్ ఆదిత్య, కేథరీన్ ట్రెసా కాంబినేషన్ చిత్రానికి ఫణి టైటిల్ ఖరారు

Phani movie team dallas

డీవీ

, బుధవారం, 2 అక్టోబరు 2024 (13:47 IST)
Phani movie team dallas
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఫణి అనే టైటిల్ ఖరారు చేశారు. పూర్తిగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. 
 
తాజాగా ఫణి సినిమా టైటిల్, బ్యానర్ లోగో ఆవిష్కరణ అమెరికాలోని  డల్లాస్ లో జరిగింది. ఫణి సినిమా టైటిల్ ను డాక్టర్ తోటకూర ప్రసాద్ లాంఛ్ చేయగా,ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ అతిథులుగా పాల్గొని ఫణి సినిమా టీమ్ కు తమ బెస్ట్ విషెస్ అందించారు. 
 
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ - నేను ఇప్పటిదాకా మీకు బాగా మ్యూజిక్ చేస్తానని, పాటలు పాడతానని తెలుసు. ఫణి సినిమాతో నిర్మాతనయ్యా. ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మిగతా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ తో మా ఓ.ఎం.జీ సంస్థలో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు. 
 
అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మాట్లాడుతూ - ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ టాలీవుడ్ మూవీ మేకింగ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ఈరోజు 90శాతం టాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ చేస్తున్నది అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రొడ్యూసర్సే. ఫణి మూవీ టైటిల్ బాగుంది. మీనాక్షి గారి మ్యూజిక్ ఆకట్టుకుంది. డాక్టర్ వీఎన్ ఆదిత్య గారికి, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో మరిన్ని మూవీస్ రావాలి. అన్నారు.
 
హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ - ఫణి మూవీ కథ విన్న వెంటనే ఈ మూవీ చేస్తానని చెప్పాను. కథ నన్ను అంతగా ఇంప్రెస్ చేసింది. నా కెరీర్ లో చేస్తున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదేనని చెప్పగలను. దర్శకుడు డాక్టర్ వీఎన్ ఆదిత్య గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆయనకు ఫిలింమేకింగ్ మీద ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అలాగే ఆయన చాలా నాలెజ్డ్ పర్సన్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఓ.ఎం.జీ సంస్థ తమ తొలి చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాం. అన్నారు.
 
డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, మీనాక్షి మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు బాగా తెలుసు. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అన్నప్పుడు ముందు ఒక షార్ట్ ఫిలిం చేయి, ప్రొడ్యూసర్ ఇబ్బందులు తెలుస్తాయి అన్నాను. కథ చెప్పండి అంది. అలా ఒక కథ చెప్పి సాయంత్రమే షూటింగ్ అంటే వెంటనే ఏర్పాట్లు చేసింది. అప్పుడు అనుకున్నా తను ప్రొడ్యూసర్ గా రాణిస్తుందని. ఫణి సినిమా కథ చెప్పగానే కేథరీన్ నాకు బాగా నచ్చింది, తప్పకుండా చేస్తానని అంది. ఆమె ధైర్యానికి అభినందనలు. కేథరీన్ లేకుంటే మా ఫణి మూవీ లేదు. ఈ మూవీకి వర్క్ చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ తో త్వరలోనే సినిమాను కంప్లీట్ చేస్తాం. ప్రీ రిలీజ్, ప్రీమియర్స్ లో మళ్లీ మనందరం కలుసుకుందాం. అన్నారు.
నిర్మాత డాక్టర్ మీనాక్షి అనిపిండి త్వరలోనే వాకో సిటీ లో తను నిర్మించబోయే "ఫిష్ ఐ " స్టూడియో బ్రోచర్ ని మాస్టర్ ధన్విన్ పాకా,మాస్టర్ శ్రీకర్ కల్లూరి ఆవిష్కరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వయస్సు పెరగని వన్నెలాడి నయనతార డిమాండ్ పదికోట్లు