Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బన్నీ చేసిన ఆర్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం: పవన్ కల్యాణ్

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య థాంక్యూ మీట్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యణ్

Advertiesment
బన్నీ చేసిన ఆర్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం: పవన్ కల్యాణ్
, శుక్రవారం, 11 మే 2018 (11:12 IST)
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య థాంక్యూ మీట్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యణ్ రాకతో థాంక్యూ మీట్ మరింత జోష్‌గా మారింది. భారీ సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ ఎంటరవ్వగానే పవర్‌స్టార్ నినాదాలతో ఆడిటోరియం మారుమోగి పోయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు.
 
పవన్ కళ్యాణ్ స్పీచ్ ''నా పేరు సూర్య'' సినిమా ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే కోరిక  కలిగింది. త్వరలోనే సినిమా చూపించాలని నిర్మాత లగడపాటి శ్రీధర్ గారికి చెప్పారు. కళ్యాణ్ మరో పర్యటనకు వెళ్లేలోపు తప్పకుండా సినిమాను చూస్తానని చెప్పారు. వక్కంతం వంశీ దర్శకుడిగా కంటే రచయితగా బాగా తెలుసని తెలిపారు కళ్యాణ్. కొమరంపులి సినిమా సమయంలో ఒక కథ చెప్పారు. దాన్ని అపుడు ముందుకు తీసుకెళ్లలేకపోయామని పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో దర్శకుడిగా కెరీర్ మెుదలు పెట్టిన వంశీ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతో విజయవంతమైన సినియా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక్కడికి వచ్చే వరకు మా అన్నయ్య నాగబాబు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అనే విషయం తనకి తెలియదని కళ్యాణ్ చెప్పారు. బన్నీ హీరోగా వచ్చిన ''ఆర్య'' తనకు చాలా ఇష్టమైన సినిమా అని పవన్ కల్యాణ్ తెలిపారు. మున్ముందుగా అల్లు అర్జున్ మంచి సినిమాలు చేస్తూ పైకెదగాలని పవన్ ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో నాకు సిగ్గెక్కువ.. కానీ రవితేజ మాత్రం ''సిగ్గు'' అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి?