Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అన్నయ్య' సీక్రెట్‌ను లీక్‌ చేసిన 'తమ్ముడు'... మరో కొత్త మూవీపై క్లారిటీ..

Advertiesment
'అన్నయ్య' సీక్రెట్‌ను లీక్‌ చేసిన 'తమ్ముడు'... మరో కొత్త మూవీపై క్లారిటీ..
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (23:01 IST)
జనసేన పార్టీ అధినేత, తెలుగు సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షల జడివానలో తడిసి ముద్దయ్యారు. పైగా, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రిప్లై ఇస్తున్నాడు. 
 
ఈ క్రమలో తన అన్నయ్య చిరంజీవి గురించిన ఓ రహస్యాన్ని పవన్ కళ్యాణ్ బహిర్గతం చేశాడు. ఆ రహస్యం చిరంజీవి కొత్త చిత్రం గురించి వెల్లడించారు. సాదాణంగా, చిరంజీవి కొత్త సినిమా గురించి ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. ఆయనకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా వైరల్ అవుతుంది. 
 
అలాంటిది ఆయన కొత్త సినిమాకు సంబంధించిన వార్త అయితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో కూడా చిరు సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ... దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే, దీన్ని బుధవారం పవన్ కల్యాణ్ కన్ఫామ్ చేశారు.
 
పవన్ పుట్టిన రోజు సందర్భంగా పవన్‌కు మెహర్ రమేశ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ... 'రమేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు... చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్' అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో, చిరు, మెహర్ రమేశ్ కాంబినేషనులో సినిమా రాబోతోందనే విషయం కన్ఫామ్ అయింది. 
 
అలాగే, తాను నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో తనకు అత్తగా నటించిన సీనియర్ హీరోయిన్ నదియాకు కూడా పవన్ వినమ్రంగా బదులిచ్చారు. పవన్ బర్త్‌డే సందర్భంగా, నదియా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ, "మీ గుడ్ విషెస్‌కు థ్యాంక్స్ నదియా మేడమ్. మీరు లేకుండా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని ఏమాత్రం ఊహించుకోలేను" అంటూ ఎంతో గౌరవభావంతో ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు.. డబ్బు.. డబ్బు.. అది లేకపోతే ఎవరు గౌరవించరు..!? నాగబాబు మనీ మంత్ర (video)