Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు.. డబ్బు.. డబ్బు.. అది లేకపోతే ఎవరు గౌరవించరు..!? నాగబాబు మనీ మంత్ర (video)

Advertiesment
డబ్బు.. డబ్బు.. డబ్బు.. అది లేకపోతే ఎవరు గౌరవించరు..!? నాగబాబు మనీ మంత్ర (video)
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:09 IST)
Nagababu
మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ నోటికి పనిచెప్పారు. ఇప్పటికే టాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పనికిమాలిన వాళ్లు మాట్లాడే మాటలు నెపోటిజం అంటూ బాలీవుడ్ మీడియాపై మండిపడ్డారు. వారసత్వం సినీ ఇండస్ట్రీలో ఈజీగా అడుగుపెట్టవచ్చు కానీ.. హీరోగా నటుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ల కృషి మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. తాజాగా డబ్బు సంపాదించడంపై నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. 
 
ముఖ్యంగా మనిషికి బంధాలు బంధాలు ముఖ్యమా.. ప్రేమానురాగాలు ముఖ్యమా.. ప్రతీది డబ్బుతో కొనలేము. డబ్బుతో కొనలేనవి కొన్ని ఉంటాయి. అన్ని పనుల కంటే డబ్బులు సంపాదించడం అత్యంత గ్రేటెస్ట్ పని అని చెప్పాడు. ఒక్క పైసా ఇవ్వకుండా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో భార్య, తల్లి తండ్రులు, పిల్లలు ఎవరు గౌరవించరు. బాధ్యతలు నెరవేర్చని వాడికి ప్రేమాభిమానాలు దొరకవని నాగబాబు వ్యాఖ్యానించారు.
 
హిందూ సంప్రదాయంలో డబ్బును లక్ష్మీదేవితో పోలుస్తారు. శ్రీ మహాలక్ష్మీగా కొలుస్తారు. మనీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఒక బిజినెస్ మేన్ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి చేస్తాడో ఆలోచన కూడా చేయలేని మనుషులు చాలామంది ఉన్నారు.. చివరకీ ఫిజికల్ ఛాలెంజ్ మనుషులు కూడా అనుకుంటే డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు అనుకుంటే డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదంటూ పెద్ద లెక్చరే ఇచ్చారు నాగబాబు.   
 
పేరు చెప్పను కానీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు అప్పులపై అప్పులే చేసేవాడు. కోరుకున్న హీరోతో నటించేవాడు. ''నిజంగా ఒకవేళ అతని పొజిషన్‌లో ఉండి ఉంటే.. నేను రూ. రెండు మూడు వేల కోట్లు సంపాదించేవాడిని. నేను ఒక టైమ్‌లో నాకు ఉన్న అప్పు ఎంతో చూసుకుంటే భయమేసిది. ఎందుకులే జరిగిపోతుంది. మేనేజ్ చేస్తున్నాడులే. మనోడు అనేవాడు ఒకడున్నాడు. చూసుకుంటాడులే. అనుకొని అనుకొని నేను ఎంత దెబ్బ తిన్నాం'' అనే విషయం నాగబాబు చెప్పుకొచ్చాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది రాక్‌ డ్వేన్ జాన్సన్‌కు కరోనా.. భార్యాపిల్లలను కూడా వదలని కోవిడ్