Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్-అలీ కలిసి నటించబోతున్నారా? పవనే ఫోన్ చేసి అలీని అడిగారట.. ఏమని?

పవన్-అలీ కలిసి నటించబోతున్నారా? పవనే ఫోన్ చేసి అలీని అడిగారట.. ఏమని?
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (10:42 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హాస్యనటుడు అలీలు మళ్లీ కలిసి నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం పవన్ వరుసగా మూడు సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను నటిస్తున్న సినిమాల్లో అలీని తీసుకోవాలని దర్శకనిర్మాతలకు పవన్  చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
అలీకి స్వయంగా పవనే ఫోన్ చేసి తన సినిమాలో నటించాలని కోరారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కోరిన వెంటనే అలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి.. సినిమాల హిట్ కోసం పవన్-అలీ కలిసి నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త పవన్ ఫ్యాన్సుకు పండగ చేసుకునేదే అవుతుందని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఇకపోతే.. పవన్-అలీ మంచి స్నేహితులే. కానీ రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. జనసేన పార్టీని స్థాపించిన పవన్ 2019 ఎన్నికలలో పాల్గొన్నాడు. అలీ జనసేనలో చేరకుండా వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ఎన్నికలలో ప్రచారం చేశాడు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'రాజమండ్రి' ప్రచార సభలో అలీని ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌‌కు కౌంటర్‌గా అలీ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది. ఈ గ్యాప్‌ను సినిమాల్లో నటించడం ద్వారా వీరిద్దరూ భర్తీ చేస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ మంచి మనస్సున్న మనిషి... నటన భగవంతుడిచ్చిన వరం...