Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుపై బూతుల వర్షం కురిపించిన వైకాపా ఎమ్మెల్యే

Advertiesment
చంద్రబాబుపై బూతుల వర్షం కురిపించిన వైకాపా ఎమ్మెల్యే
, బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (20:04 IST)
ysrcp leader siva kuamar
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే బూతుల వర్షం కురిపించారు. అదీ కూడా పత్రికల్లో రాయలేని భాషలో ఆయన బూతులు తిట్టారు. ఆయన పేరు అన్నాబత్తుని శివకుమార్. పైగా, తాను తెనాలి ఎమ్మెల్యే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదనీ, స్వర్గీయ ఎన్టీరామారావుది అని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కమ్మ కులాన్ని అడ్డు పెట్టుకుని అమరావతి జేఏసీ ముసుగులో ఉద్యమాలు చేస్తున్నారంటూ చంద్రబాబును రాయలేని భాషలో దూషించారు. అమరావతి ఉద్యమంలో ఉన్నవారంతా కమ్మవాళ్లేనని శివకుమార్ ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో అమరావతికి చేసిందేమీలేదని విమర్శించారు. అమరావతి నియోజకవర్గంలో వైసీపీ గెలిచిందన్నారు. టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని శివకుమార్ అన్నారు.
 
అలాగే, ఏపీ మంత్రి కె.కన్నబాబు కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రచారాన్ని భుజాలపై మోసే సొంత ప్రచార సాధనాలను పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఒక కృత్రిమ పోరాటాన్ని తయారు చేశారని ఆరోపించారు. మొన్నటివరకూ అక్కడ వీధుల్లో తిరిగి జోలె పట్టుకుని చంద్రబాబు చందాలు వసూలు చేశారని, ఆయన క్యారెక్టర్‌కు ఇది ఒక నిదర్శనమన్నారు. జోలె పట్టుకుని సేకరించిన బంగారం, డబ్బులు ఎంత వచ్చాయో చెబితే చంద్రబాబు నిజాయితీ ఏంటో తెలుస్తుందన్నారు.  
 
రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత చంద్రబాబు భంగపడ్డారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు విజన్‌ విశాఖలో బికినీ ప్రదర్శన చేయాలని... వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్‌ విజన్‌’ అని అన్నారు. మంత్రులు నారావారిపల్లె కాదు.. ఏ ప్రాంతానికి అయినా వెళతారు. సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువకుడితో వివాహిత వివాహేతర సంబంధం, అవి కోసేసిన పెద్దలు