Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీపై వీణామాలిక్ సెటైర్లు.. నెటిజన్ల విమర్శలు

మోదీపై వీణామాలిక్ సెటైర్లు.. నెటిజన్ల విమర్శలు
, బుధవారం, 5 జూన్ 2019 (17:13 IST)
పాకిస్థాన్ శృంగార తార వీణామాలిక్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కానీ భారత్‌లో డబ్బు సంపాదించుకుని.. ప్రస్తుతం గతాన్ని మరిచి ఏవేవో వాగుతోందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 
 
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? బాలాకోట్‌ దాడులపై గతంలో భారత ప్రధాని మోదీ వ్యాఖ్యలను వీణా మాలిక్ ప్రస్తావిస్తూ.. ఆ దాడుల సమయంలో వాతావరణం సరిగ్గా లేకపోవడం చేత సరిహద్దులు దాటడానికి అధికారులు భయపడుతుంటే తాను భరోసా ఇచ్చానని మోదీ చెప్పారు. మేఘాలు దట్టంగా ఉంటే మనకే మంచిదని, రాడార్లకు మన విమానాలు కనిపించవని గుర్తు చేశానని మోదీ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై వీణామాలిక్ స్పందిస్తూ.. ఏఎన్-32ను రాడార్లు కనుక్కోవడం లేదని, మేఘాలు దట్టంగా ఉండటమే కారణమని ఓ స్మైలీ ఇమేజ్‌ని జత చేసి ట్వీట్ చేసింది. అయితే వీణామాలిక్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విమానాన్ని కనుగొనేందుకు ఇప్పటికే ఇస్రో శాటిలైట్లు, రాడార్లు రంగంలోకి దిగాయని గుర్తుచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ స్టోరీ నాక్కాదు కానీ నా తమ్ముడు అఖిల్‌కి చెప్పు... దర్శకుడితో నాగచైతన్య