100 రోజుల్లో భారత్‌లో 5జీ టెక్నాలజీపై పరిశీలన.. Huawei రెడీ

బుధవారం, 5 జూన్ 2019 (16:23 IST)
భారత్‌లో 100 రోజుల్లో 5జీ టెక్నాలజీపై పరిశీలన జరుగనుంది. ఈ విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకునేలోపే.. 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు హువే గట్టిగా కార్యాచరణ మొదలెట్టింది. ఇక వందరోజుల్లో 5జీపై టెక్నాలజీ పరమైన పరిశోధన జరుగనుందని టాక్. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం 5జీ టెక్నీలజీ పరిశోధనను ప్రారంభించేశాయి. 
 
ఈ జాబితాలో త్వరలో భారత్ చేరనుంది. 5జీ టెక్నాలజీని పొందాలనుకున్న మొబైల్ సంస్థల కోసం జరిగే వేలం కూడా ఈ ఏడాది చివర్లోపు పూర్తి కానుంది. ఐరోపా దేశాల్లో ఈఈ సంస్థ 5జీ సేవల వినియోగానికి సన్నద్ధమైంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో వున్న భారత్ కూడా 5జీ సేవల కోసం సిద్ధమవుతోంది. భారత్‌లో ట్రాయ్, 20 మెగాహెడ్జ్‌లను వేలానికి సిద్ధమవుతున్నాయి. 
 
ఇందులో ఒక మెగాహెడ్జ్‌కు 492 కోట్ల రూపాయల ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో 5జీ టెక్నాలజీని హువే పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో భారత్‌లోనూ హువేనే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నీట్ ఫలితాలు విడుదల.. అమ్మాయిల్లో తెలంగాణ బిడ్డ టాపర్..