Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓసి పెళ్లామా! అంటూ ఖుషిలో సమంతను ఆటపట్టిస్తున్న విజయ్ దేవరకొండ

Vijay-samanta song
, గురువారం, 24 ఆగస్టు 2023 (16:55 IST)
Vijay-samanta song
విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ గా నటించిన ‘ఖుషి’ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్  టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
 
హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’కి మ్యూజిక్ ఎంత ఆకర్షణ అయ్యిందో చూస్తున్నాం. అందుకే ఈ మూవీకి స్పెషల్ గా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ కు ఆడియెన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నాలుగు లిరికల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఐదో పాట 'ఓసి పెళ్లామా..' రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 26న ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ఓసి పెళ్లామా..' పాట అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో షాంపేన్ తో విప్లవ్ తన ఫ్రెండ్స్ ను ఉత్సాహపరుస్తున్న మూమెంట్ ఇంప్రెస్ చేస్తోంది.
 
సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ‘ఖుషి’ ఇంకో 8 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విప్లవ్, ఆరాధ్య ప్రేమకథను అందంగా తెరపై చూపించబోతోందీ సినిమా.
 
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకిప్పుడు 50 ఏళ్లు, ఈ వయసులో పెళ్లా?: 'శ్రీమంతుడు' తల్లి షాక్