Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ళ్యాణ్ రామ్.. క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ను డైరెక్ట‌ర్ తేజ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తూ.. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ళ్యాణ్ రామ్.. క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?
, మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:40 IST)
స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ను డైరెక్ట‌ర్ తేజ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తూ.. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైన ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వార్త ఏమిటంటే... ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ న‌టిస్తున్నాడ‌నేది ఆ వార్త సారాం‍శం. 
 
 
 
ఇంత‌కీ... క‌ళ్యాణ్ రామ్ పాత్ర ఏమిటంటే.. హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్ పోషించ‌నున్నాడ‌ట‌. ఎన్టీఆర్‌ అధికారంలోకి రావటానికి ఎన్నికల సమయంలో చేపట్టిన చైతన్య రథం ఓ కారణం. ఆ రథాన్ని నడిపింది ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణే. దీంతో ఈ పాత్రకు కళ్యాణ్‌ రామ్‌ అయితేనే బావుంటుందన్న ఆలోచనతో ఆ నందమూరి హీరోను మేకర్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. 
 
ఇక చిత్ర లాంఛింగ్‌కు కళ్యాణ్‌ రామ్‌ హాజరుకావటం.. పైగా తన తండ్రి పాత్రే కావటంతో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నారా రోహిత్‌, తారకరత్నలకు కూడా ఈ చిత్రంలో పాత్రలు దక్కాయని ఆ కథనం వివరించింది. మే నుంచి ఎన్టీఆర్‌ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోబోతుండగా.. దసరాకు చిత్రం విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి మెహ‌బూబా ట్రైల‌ర్ రిలీజ్.. ఛార్మి షాకింగ్ రియాక్ష‌న్..? (Trailer)