జయలలిత కాళ్లు తొలగించలేదు.. నేనే వేళ్లను కట్టాను: అమ్మ డ్రైవర్
దివంగత సీఎం జయలలిత మృతిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా అమ్మ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్పత్రిలో ఆమెను మూడుసార్లు చూశానని.. అమ్మను అపస్మారక స్థితిలోనే ఆమెను ఆస్పత్రిలో చేర్చారని ఆమె మృతిప
దివంగత సీఎం జయలలిత మృతిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా అమ్మ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్పత్రిలో ఆమెను మూడుసార్లు చూశానని.. అమ్మను అపస్మారక స్థితిలోనే ఆమెను ఆస్పత్రిలో చేర్చారని ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ముందు ఆమె కారు డ్రైవర్ అయ్యప్పన్ తెలిపారు.
జయమ్మ మరణించిన తర్వాత ఆమె కాలి వేళ్లను తానే కట్టానని.. డ్రైవర్ చెప్పారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని.. దీంతోనే అపస్మారక స్థితికి చేరుకున్నాక హడావుడిగా ఆస్పత్రికి తరలించినట్లు జయలలిత డ్రైవర్ చెప్పారు.
ఆస్పత్రిలో చేరిన ముప్పావు గంట తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారని వెల్లడించారు. అయ్యప్పన్ అమ్మ వద్ద పది సంవత్సరాల పాటు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపాడు. ఇకపోతే.. 2016 సెప్టెంబరులో అనారోగ్యానికి గురైన జయలలిత చెన్నై అపోలో చికిత్స పొందుతూ డిసెంబర్ ఐదో తేదీన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.