ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చేవరకు పెద్దగా కష్టాలు అనుభవించింది లేదు.. మహారాజులా ఆయన ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలారాయన. కానీ క్రిష్ వాటిపై ఫోకస్ చేయకుండా కేవలం ఆయన వైభోగాన్ని కథానాయకుడులో.. రాజకీయంగా ఎదిగిన విధానాన్ని మహానాయకుడులో చూపించాడు.
ఇందులో ఎన్టీఆర్ జీవితంలో అతి ముఖ్యమైన చరమాంకం లేకపోవడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చరమాంకానికి సంబంధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రానుంది.
ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు రెండు పాటల రిలీజ్‌తో వేడి పెంచిన వర్మ తాజాగా సినిమాలోని ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో ''నీ ఉనికి నా జీవితానికి అర్థం" అనే పాటను వర్మ ఆదివారం రిలీజ్ చేశారు.
ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యం అందించగా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్ సంగీతమందించారు. ఈ సినిమాను మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన నీ ఉనికి నా జీవితానికి అర్థం లిరికల్ సాంగ్‌ను ఓ లుక్కేయండి.