Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Advertiesment
Nani -The Paradise

దేవీ

, శనివారం, 28 జూన్ 2025 (20:25 IST)
Nani -The Paradise
శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ 'ది పారడైజ్'- హైదరాబాద్‌లో 40 రోజుల ఎక్సటెన్సివ్ షెడ్యూల్‌లో జాయిన్ అయిన నాని- మార్చి 26, 2026న థియేటర్స్ లో రిలీజ్
 
నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్'లో అడుగుపెట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్  సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. జూన్ 21న షూటింగ్ ప్రారంభమైంది. నాని ఈరోజు సెట్స్‌లో అడుగుపెట్టారు.
 
వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. “ధగడ్  ఆగయా!” అంటూ అమెజింగ్ అనౌన్స్‌మెంట్‌తో లుక్‌ రిలీజ్ చేశారు. బరువైన బార్బెల్ వెయిట్స్‌పై నాని కాలు మాత్రమే కనిపించే పోస్టర్‌లో ‘ఈసారి నాని మరింత ఫెరోషియస్ వస్తున్నాడు’అనే క్యాప్షన్ ఆకట్టుకుంది.
 
ఈ 40 రోజుల హైదరాబాద్ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో కూడిన పవర్‌ఫుల్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గ్రాండ్ సెట్స్‌లో షూటింగ్ జరగనుంది. ‘దసరా’ సినిమా పాన్ ఇండియా అదరగొట్టింది. 'ది పారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ 8 భాషలలో విడుదల కానుంది.
 
టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఉన్న పవర్‌ఫుల్ డైలాగ్, విజువల్స్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్‌ మ్యూజిక్, నాని స్ట్రాంగ్ ఎంట్రీ... ఇవన్నీ సినిమా పై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
 
మార్చి 26, 2026న ‘ది పారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు