Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని న్యూ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..?

Advertiesment
నాని న్యూ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..?
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (20:53 IST)
నాని జెర్సీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకురానున్నాడు. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. 
 
మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాని ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమ చేయ‌నున్నారు. గతంలో నాని కథానాయకుడిగా దర్శకుడు ఇంద్ర‌గంటి మోహనకృష్ణ అష్టా చమ్మా, జెంటిల్ మేన్ చిత్రాల‌ను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి.
 
ఇక సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహనకృష్ణతో సమ్మోహనం అనే సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా కూడా స‌క్స‌స్ సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ఇంద్రగంటి మోహనకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమాకి వ్యూహం అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని స‌మాచారం. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. మ‌రి...ఈ సినిమాతో నాని, సుధీర్ బాబు క‌ల‌సి ప్రేక్ష‌కుల‌ను ఏ రేంజ్‌‌లో ఆక‌ట్టుకుంటారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రోచేవారెవ‌రురా చిత్రంలో నివేదా థామ‌స్ లుక్ అదిరిందిగా..!