Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విషయంలో సిల్క్ స్మితను తలదన్నే ఆడదే లేదు.. శ్రీదేవి కూడా?: బాలయ్య

nandamuri Balakrishna

సెల్వి

, శుక్రవారం, 21 జూన్ 2024 (14:28 IST)
నందమూరి బాలకృష్ణ సిల్క్ స్మితపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఏది చెప్పినా బల్ల గుద్దినట్లు నిక్కచ్చిగా చెప్తాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. సిల్క్ స్మిత మేకప్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి నోరు విప్పారు. 
 
ఇండస్ట్రీలో మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదు అంటూ చెప్పుకొచ్చారు. సిల్క్ స్మిత అందరికంటే డిఫరెంట్‌గా ఆమె కనిపించేది. ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది హీరోయిన్లు ప్రయత్నించేవారని బాలయ్య అన్నారు. ఆడది అని ఎందుకు అంటున్నానంటే.. అప్పటి టాప్ హీరోయిన్లు శ్రీదేవి లాంటి వారు కూడా మేకప్ విషయంలో సిల్క్ స్మితని ఫాలో అయ్యేవారు అని బాలయ్య తెలిపారు. ఆదిత్య 369 చిత్రంలో సిల్క్ స్మితని తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్ గారిదే అని బాలయ్య అన్నారు.  
 
ఇకపోతే.. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో క్లాసిక్ అనిపించదగ్గ చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్‌లో నటించారు. అందులో ఒక పాత్ర శ్రీకృష్ణ దేవరాయులుగా నటించారు. 
 
ఈ చిత్రంలో స్మిత కీలక పాత్రలో నటించింది. రాజనర్తకిగా నటించి మెప్పించింది. కాగా 80, 90 దశకాల్లో బోల్డ్ పాత్రలతో సిల్క్ స్మిత చేసిన సందడి అంతా ఇంతా కాదు. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అవమానాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటీవి విన్‌లో అద్భుత‌మైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ర‌విబాబు ర‌ష్‌